పెద్దపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన జువ్వాడి నర్సింగ్ రావు

viswatelangana.com
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గురుకుల విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జువ్వాడి నర్సింగారావు అన్నారు. మంగళవారం మెట్ పల్లి మండలంలోని పెద్దపూర్ గురుకుల పాఠశాలను స్థానిక నాయకులతో కలిసి విద్యార్థుల సౌకర్యాల నిమిత్తం కొత్తగా వచ్చిన డబుల్ కాట్ బెడ్స్, డెస్క్ లను ఇతర సామాగ్రిని పర్య వేక్షించారు. గురుకలంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయాలని గురుకులాల్లో విద్యార్థుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పెద్దపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి ఆ రోజు ఇచ్చిన పాఠశాల సందర్శనలో జువ్వాడి నర్సింగరావు మాట ప్రకారం తమ మాటను నిలబెటుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, శీలం వేణు, మాజీ జెడ్పిటిసి ఆకుల లింగారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షు డు అంజిరెడ్డి, ఆనంద్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు పన్నాల మాధవరెడ్డి, చంటి, సురేష్ పాల్గొన్నారు



