
viswatelangana.com
బుధవారం అక్టోబర్ 2 వ తేదీన జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మెట్ పల్లి డీ ఎస్పీ కే.ఉమామహేశ్వర్ రావు వివరాలు తెలుపుతూ తేది: 28-09-2024 రోజున సాయంత్రం 6 గంటల సమయంలో కోరుట్ల పట్టణానికి చెందిన బంగారి సాయన్న, తండ్రి: పోత లింగం, వయసు: 60 సంవత్సరములు, గ్రామము: బాలాజీ రోడ్డు కోరుట్ల పట్టణ నివాసుడు అనునతడు కొబ్బరి బొండాలు అమ్ముకుంటూ జీవిస్తాడు. అందాజ 10 రోజుల క్రితం అతడు కోరుట్లలోని వేములవాడ రోడ్డు లో ఎస్ బి ఐ బ్యాంకు ముందరగల తన యొక్క కొబ్బరి బొండాల బండి వద్ద ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చి ఒక కొబ్బరి బోండా ఇవ్వమని అడగగా అతడు అతనికి కొబ్బరి బోండా కొట్టి ఇచ్చినాడు. అట్టి వ్యక్తి కొబ్బరి బోండా త్రాగిన తర్వాత అతను అతనికి ఒక 500/- రూపాయల ఫేక్ కరెన్సీ నోటు ఇవ్వగా అతడు 40/- రూపాయలు పట్టుకొని మిగతా 460/- రూపాయలు అట్టి వ్యక్తికి తిరిగి ఇచ్చినాడు. తర్వాత అతడు తన వద్ద ఉన్న డబ్బులను లెక్కించుచుండగా అందులో ఒక 500/- రూపాయల నోటు తేడాగా కనిపించడంతో అతడు కోరుట్ల పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా కోరుట్ల పోలీస్ వారు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకోవడానికి గౌరవ జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాను సారంతో మెట్ పల్లి డీ ఎస్పీ కే ఉమామహేశ్వర్ రావు పర్యవేక్షణలో, కోరుట్ల సిఐ బి.సురేష్ బాబు ఆద్వర్యములో రెండు బృందాలుగా ఏర్పాటు చేయగా తేది: 01-10-2024 రోజున `నమ్మదగిన సమాచారం మేరకు కోరుట్ల పట్టణంలో తిలక్ రోడ్లో ఓ ఇంటిలో కొందరు వ్యక్తులు నకిలీ నోట్ల సరఫరా చేయుటకు సమావేశమైనారని నమ్మదగిన సమాచారం రాగా కోరుట్ల సీఐ, కోరుట్ల ఎస్సై మరియు వారి సిబ్బంది యుక్తంగా వెళ్లగా అక్కడ ఐదుగురు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే పోలీస్ సిబ్బంది వారిని పట్టుకొని ఎందుకు పారిపోతున్నారు అని ప్రశ్నించగా వారు భయాందోళనకు గురి అవుతూ వారి పేర్లు చెప్పుకుంటూ తడబాటుకు గురి అవగా వెంటనే వారిని సోదా చేయగా 500 రూపాయల నోట్ల కట్టలు కొన్ని లభించినాయి. అవి ఎక్కడివి అని ప్రశ్నించగా అవి నకిలీ నోట్లని చెప్పడంతో మేము సంబంధిత బ్యాంక్ అధికారులకు అవి నకిలీ నోట్ల లేక ఒరిజినల్ నోట్ల అని పంపించగా అవి నకిలీ నోట్లని నిర్ధారించినారు తర్వాత మేము అట్టి వ్యక్తులను విచారించగా నిందితుడు ఎ-1 అనునతను రాజస్థాన్ నుండి 2 లక్షల రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లను గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుండి తీసుకొని వచ్చి నిందితుడు ఎ-2 ద్వారా ఎ-3, ఎ-4 మరియు A-5 లకు నకిలీ నోట్లను ఇచ్చి చలామణి చేయమని చెప్పగా ఎ-4 అనునతను గత పది రోజుల క్రితం కోరుట్లలో ఒక కొబ్బరి బోండాలు అమ్మే వ్యక్తికి మరియు రొట్టెలు అమ్మే వ్యక్తి కి చెరో 500 రూపాయల నకిలీ నోట్లు ఇచ్చి చలామణి చేయగ తర్వాత ఇట్టి విషయం ఎ-4 అనునతను తన మిగతా నలుగురు సభ్యులకు చెప్పగా వారు కోరుట్ల పట్టణం మరియు పరిసర ప్రాంతంలో సులభంగా నకిలీ నోట్ల ను చలామణి చేయచ్చని నిర్ణయించుకొని తేదీ: 30-09-2024న ఎ-4 అనునతని యొక్క కోరుట్ల పట్టణంలో నివాసం ఉండే ఇంటికి మిగతా నలుగురు వచ్చినారని వారు నకిలీ నోట్లను చలామణి చేయుటకు నిన్న అనగా తేదీ: 01-10-2024 రోజున సాయంత్రం 03 గంటలకు సమావేశం అయినారని కోరుట్ల సీఐ బి సురేష్ బాబు మరియు కోరుట్ల ఎస్సై ఎస్ శ్రీకాంత్ లకు నమ్మదగిన సమాచారం రాగా వారు వారి సిబ్బంది యుక్తంగా వెళ్లి వారిని పట్టుకొని వారి వద్ద నుండి 1,61,000/- రూపాయల నకిలీ 500 రూపాయల నోట్లు మరియు వారి వద్ద నుండి ఐదు సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. నిందితులను పట్టుకోవడానికి చాకచక్యంగా వ్యవహరించిన కోరుట్ల సీఐ బి. సురేష్ బాబు మరియు కోరుట్ల ఎస్సై ఎస్. శ్రీకాంత్ లను మరియు వారి సిబ్బందిని జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్ అభినందించినారని తెలిపినారు.ఈ సంధర్బంగా ఇలాంటి నకిలీ నోట్ల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇలాంటి నకిలీ నోట్లు చలామణి చేసే ఎవరైనా వ్యక్తులు ఉంటె తమకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.



