రాయికల్
పోటా పోటీగా సాగిన కుమ్మరిపెల్లి క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్

viswatelangana.com
March 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపెల్లి గ్రామంలో ఫిబ్రవరి 18న ప్రారంభమైన కుమ్మరిపెల్లి క్రికెట్ టోర్నమెంట్ విలేజ్ టు విలేజ్ పోటీలలో భాగంగా, మంగళవారం రోజు ఫైనల్ మ్యాచ్ మైతాపూర్, మేడిపల్లి గ్రామాల మధ్య పోటా పోటీగా కొనసాగింది. ఫైనల్ మ్యాచ్ లో మైతాపూర్ టీం విన్నర్ గా నిలువగా, మేడిపల్లి టీం రన్నర్ గా నిలిచింది. మొదటి బహుమతి 20000 రూపాయలతో పాటు ట్రోపీని మైతాపూర్ టీంకు అందజేశారు. రెండవ బహుమతి 10000 రూపాయలతో పాటు ట్రోఫీని మేడిపెల్లి టీంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రైజ్ మనీ స్పాన్సర్ కల్వకోట కార్తీక్, ట్రోఫీ స్పాన్సర్స్ యం.డి. షేక్, పెనుకొండ గణేష్, బుల్స్ యూత్ సభ్యులు, ఓల్లాల నవీన్, క్రికెట్ నిర్వాహకులు శివమణి, ఉడుత రాం సురేష్, శ్రీను, గంగన్న, మరియు రాజేందర్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



