కొడిమ్యాల

ప్రతి విద్యార్థికి హెల్ప్ లైన్ నెంబర్లపై అవగాహన ఉండాలి

viswatelangana.com

July 7th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ఆదేశాల మేరకు సోమవారం రోజున కళాశాల ప్రిన్సిపాల్ కె.వేణు అధ్యక్షతన ‘సామాజిక రుగ్మతలపై’ అవగాహన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన వక్త స్టూడెంట్స్ కౌన్సిలర్ డా. పి. తిరుపతి విద్యార్థులకు ఆధునిక సామాజిక రుగ్మతలైన మానవ అక్రమ రవాణా, డ్రగ్స్ దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్టూండెంట్స్ కౌన్సిలర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పట్ల, సైబర్ నేరాల పట్ల, మత్తు పదార్థాల పట్ల, ఫేక్ సోషల్ మీడియా ప్రకటనల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని,వాటి బారిన పడినప్పుడు 1908,100,1098, 112,1930 వంటి పలు హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి రక్షణ పొందాలని సూచించారు. విద్యార్థులు హెల్ప్ లైన్ నెంబర్లపై తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు, చుట్టుపక్కల వారికి అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఆఫీస్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button