వీర పాండ్య కట్ట బ్రహ్మన విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com
మహనీయుల ఆశయ సాధనకు కృషి చేద్దాం అని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం కథలాపూర్ మండలం తుర్తి గ్రామంలో ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో నెలకొల్పిన వీర పాండ్య కట్ట బ్రహ్మన విగ్రహావిష్కరణ మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ వీర పాండ్య కట్ట బ్రహ్మన18 శతాబ్దంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేశారని పేర్కొన్నారు.వారి ఆశయ సాధనకు పాటుపడదామని తెలిపారు. నేటి యువత మహనీయుల ఆలోచనలతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజ్ లకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిందని తెలిపారు. మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ సేవకుడిగా ఉంటూ మన ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తా అన్నారు.దేశ చరిత్రలోనే ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని రైతులందరికీ ఏక కాలంలో రుణమాఫీ చేసాం. మీ ఆశీస్సులతో అధికారంలోకి వచ్చాక రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 31 వేల కోట్లు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆమోదింప చేసుకొని జూలై 15 న రుణమాఫీ జీవో తీసుకువచ్చాం. జూలై 18వ తేదీన 0 నుంచి 1 లక్ష వరకు ఉన్న రైతులకు, జులై 30న లక్ష యాభై వేల వరకు, ఆగస్టు 15న 2 లక్షల వరకు మీరు ఎన్నుకున్న ఉన్న ప్రభుత్వం రుణమాఫీ చేసింది.కేవలం 27 రోజుల్లోనే దాదాపు 22.37 లక్షల మంది రైతుల కుటుంబాలకు దాదాపు రూ.18 వేల కోట్ల రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ అర్హులైన రైతులకు మా ప్రభుత్వ అండగా ఉంటుంది. 10 సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు.. రుణమాఫీ చేసే విషయంలో రేషన్ కార్డు కుటుంబానికి ప్రామాణికంగా తీసుకున్నప్పుడు రేషన్ కార్డు లేకపోవడంతో కొంత ఇబ్బంది ఏర్పడిందన్నారు. ఇందులో ఆధార్ కార్డు తప్పుల వలన, బ్యాంకర్లు వివరాలు తప్పుగా పంపడం వలన,రేషన్ కార్డ్ లేకుండా కుటుంబంలో సాంకేతిక లోపం వలన, బ్యాంకర్లు గతంలో తండ్రి పేరు పై ఉంటే తదుపరి తండ్రి విదేశాల్లోకి వెళితే వారి కొడుకు పేరు పైన రుణాలు రీ షెడ్యూల్ చేయడం వలన సాంకేతికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయనీ పేర్కొన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కానీ వారి నుండి దరఖాస్తులు స్వీకరించడానికి గ్రామాల్లో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల ఇండ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కథలాపూర్ మండలాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్తానని తెలిపారు.



