viswatelangana.com
ప్రజా నాయకుడు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చోరువతోనే ఉమ్మడి మండలానికి గెలిచినా 3 మాసలలోపే 4కోట్ల 88లక్షల 70వేయిలు నిధులు మంజురయ్యాయి ప్రభుత్వ విప్ ప్రజా సేవకునికి ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఈరోజు మేడిపల్లి మండలకేంద్రంలో ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల అధ్యక్షులు ఏనుగు రమేష్ రెడ్డి, భీమవరం మండల అధ్యక్షులు ఎన్ఆర్ఐ గల్ఫ్ కన్వీనర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి మాట్లాడుతూవేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గెలిచిన మూడు మాసల లోపే ఉమ్మడి మేడిపల్లి మండలం కు నాలుగు కోట్ల 88 లక్షల 70 వేల రూపాయలను మంజూరు చేసి మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లడం జరిగింది అని కొనియాడారు, ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే పాలనలో అందుబాటులో లేకపోవడంతో పాటు అభివృద్ధి విషయంలో మన నియోజకవర్గంపై వివక్ష చూపడం జరిగింది. ఇప్పుడు వచ్చిన మన నాయకుడు ప్రజాలకు అందుబాటులో ఉంటూ , సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు అని తెలిపారు, ఇలాంటి నాయకుడుని ఎన్నుకోవడం ప్రజల గొప్పదనం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనా ప్రభుత్వం ఇచ్చిన 6గ్యారంటీ హామీలను ఏర్పడిన 48 గంటలలోనే రాజీవ్ ఆరోగ్యశ్రీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా రెండు హామీలను నిన్నటి రోజు గృహజ్యోతి 200యూనిట్స్ ఉచిత విద్యుత్ , గ్యాస్ బండ 500 రూపాయలకు అమలు చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుంది. కావున ప్రజలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి భారీ మెజార్టీని ఇవ్వగలరని కోరారు.. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జలంధర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీపతి దామోదర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరటి మల్లేశం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిని గంగారెడ్డి, అధికార ప్రతినిధి చేపూరి నాగరాజు, బిసి సెల్ అధ్యక్షుడు మాదం వినోద్, బీసీ సేల్ ప్రధాన కార్యదర్శి మర్రిపెల్లి స్వామి గౌడ్ సీనియర్ నాయకులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కొండ్రా గంగాధర్, ఉరుమడ్ల నర్సయ్య, ఎండి యూసఫ్, చెక్కపల్లి శంకర్,నేరళ్ల సత్తయ్య,వడ్డే రాంరెడ్డి, కమ్మరి లక్ష్మీ నరసయ్య, జిల్లా రమేష్, ఎడ్ల లక్ష్మి నర్సయ్య, గౌరీ దశరథం, ఏనుగు రాఘవరెడ్డి, చెక్కపల్లి సంజీవ్, కల్వకోట రమేష్ హరీష్, మార్గం నవీన్ పటేల్, రాము తదితరులు పాల్గొన్నారు..



