రాయికల్
ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో గేదెలు మృతి

viswatelangana.com
June 17th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో బ్రిడ్జి సమీపంలో విద్యుత్ వైర్లు తెగి, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి గ్రామానికి చెందిన ముగ్గురి రైతులకు చెందిన 3 పాడి గేదలు మృతి చెందాయి. తమకు ఉపాధి అందించే గేదెలు చనిపోవడం తో పాడి రైతులు దండవేణి అంతయ్య, మారసు గంగారాం, గడికొప్పుల మల్లేశం కన్నీరు మున్నిరయ్యారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తగినంత సహాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.



