కోరుట్ల
అక్షితను అభినందించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
October 7th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణం అర్బన్ హౌసింగ్ కాలనీకి చెందిన తుమ్మదీ అక్షిత ఎంసెట్ లో 2914వ ర్యాంక్ తో మెడిసిన్ లో సీటు సాధించింది, ఇట్టి విసాయం తెలుసుకున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఇంటికి వెళ్లి అక్షితను ఘనంగా సన్మానించి భవిష్యత్తులో డాక్టర్ గా పేద ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు స్థానిక మున్సిపల్ వార్డు కౌన్సిలర్ పుప్పాల ఉమాదేవి ప్రభాకర్, కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, భూస రాజేశ్వర్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళలు ఉన్నారు.



