రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ వేంటనే అమలు చేయాలి
ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్

viswatelangana.com
షెడ్యూల్డ్ కులాల జనాభా దామాషా ప్రకారం ఎబిసిడి వర్గీకరణ కావాలనే న్యాయ పోరాటం సుప్రీం కోర్టు తీర్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించినట్లు ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ కోరారు.బుధవారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన సమావేశంలో పేట భాస్కర్ మాట్లాడుతూ… వర్గీకరణ అంటే కేవలం మాల, మాదిగల పంచాయతీ కాదని 59 కులాల న్యాయబద్దమైన పోరాటమని ఎస్సీ వర్గీకరణ వల్ల జనాభా దామాషా ప్రకారం ఎస్సీలలోని అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని ఆగష్టు 1 వ తేదీన ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భర్తీ చేయబోయే ఉద్యోగ నియామకాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ లకు అలాగే ఇవ్వబోయే నోటిఫికేషన్ లకు ఎస్సీ వర్గీకరణను వర్తింపజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పేట భాస్కర్ కోరారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుంటదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతో ఆశ పెట్టుకొని వేచి చూస్తున్నారని, వారికి తగిన న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియామకాలు ఉండాలని పేట భాస్కర్ స్పష్టం చేశారు.ఈ కార్య్రమంలో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు దూమల గంగారాం, సురుగు శ్రీను (జగన్) జిల్లా అధికార ప్రతినిధి బెజ్జెంకి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు బొనగిరి కిషన్, శనిగారపు రాజేష్, కథలాపూర్ మండల మాజీ అధ్యక్షులు తెడ్డు గంగారాం, మండల నాయకులు పాలేపు సంజీవ్, పానుగంటి ప్రశాంత్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.



