రాయికల్
బంధాల్ని మరింత బలపరిచే పండగ హోలీ

viswatelangana.com
March 13th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో నిర్వహించబడిన ముందస్తు హోలీ పండుగ సందర్భంగా ప్రిన్సిపాల్ బాలే శేఖర్ మాట్లాడుతూ హోలీ పండుగ భారతదేశంలో ఎంతో ప్రత్యేకమైనదని, ఇది రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిందని, సాధారణంగా ఫాల్గుణ పౌర్ణమి రోజున జరుపుకుంటారని,హోలిక దహనంతో చెడ్డదానిపై మంచిదానిది గెలిచినట్లు సూచిస్తుందని, ప్రజలు రంగులు చల్లుకుంటూ, పరస్పరం ఆనందాన్ని పంచుకుంటారని,హోలీ అందరినీ సమానంగా చేసి, విభేదాలను మరిచిపెట్టి కొత్త నడవడికకు నాంది పలుకుతుందని,హోలీ అంటే సందడి, స్నేహం, ప్రేమ, మరియు బంధాలను మరింత బలపరిచే పండుగ అని అన్నారు. పిల్లలు ఒకరికొకరు రంగులు పూసుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.



