కథలాపూర్

బతుకమ్మ,దసరా ఉత్సవాల ఏర్పాట్లు ఘనంగా చేయాలి

viswatelangana.com

October 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

రానున్న బతుకమ్మ,దసరా పండగ ఉత్సవాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆదేశించారు. శుక్రవారం కథలాపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైతు వేదిక ఆవరణలో కథలాపూర్, భీమారం, మేడిపల్లి మండలాల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ విప్ ఆయా గ్రామాల్లోని కార్యదర్శులు,ఇంచార్జి లను ఏమైన సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం జరగడం వలన గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ పాలన కొనసాగుతుందని రానున్న దసరా, బతకమ్మ,దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆయా గ్రామాల్లో ఉన్న స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలు ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే నేటి నుంచే వాటిని పరిష్కరిస్తూ పండుగ నాటికి సరియైన ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా ఉండేలా చూడాలని పేర్కొన్నారు… ప్రతీ రోజూ గ్రామాల్లో శానిటేషన్ పనులు నిర్వహించాలని, పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని, సీసీ రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండేలా చూడాలని పేర్కోన్నారు.. వీధిలైట్లు వెలిగేలా చూడాలని పేర్కొన్నారు.. గ్రామాల్లో రోడ్డు కు ఇరువైపులా పిచ్చిమొక్కలను తొలగించాలని పేర్కొన్నారు.. గ్రామాల్లో పచ్చదనం ఉండేలా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని, కరెంట్ తీగలు ఉన్న పక్క పూల మొక్కలు నాటాలని, లేని పక్క పండ్ల మొక్కలను నాటాలని సూచించారు… మూడు మండలాల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రధాన కూడళ్లు కొత్త శోభ సంతరించుకునేల, సుందరంగా చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. అందులో భాగంగా పూల కుండీలను అమర్చలని సూచించారు. తద్వారా గ్రామాల్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్లు, ఇన్చార్జిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఆయా గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, ప్రతి వీధులలో, ప్రధాన కూడళ్లలో వీధిలైట్ల వెలిగేల చూడాలని పేర్కొన్నారు.. ప్రభుత్వం అందించే సూచనలను సలహాలు పాటిస్తూ ముందుకు పోవాలన్నారు.. కొన్ని గ్రామాల్లో ప్రజలకు సర్టిఫికెట్ ల జారీ విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తు సర్టిఫికెట్ లను సత్వరమే జారీ చేయాలని అధికారులకు సూచించారు. రానున్న బతుకమ్మ దసరా పండగ నాటికి గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా చూడాలని పేర్కొన్నారు..

Related Articles

Back to top button