రాయికల్

బదిలీపై వెళ్లిన విద్యుత్ ఉద్యోగులకు ఘన సన్మానం

viswatelangana.com

October 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ సెక్షన్ పరిధి నుండి బదిలీపై వెళ్లిన విద్యుత్ అధికారులను శుక్రవారం సాయంత్రం రాయికల్ విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. జగిత్యాల రూరల్ ఏడిఈగా పనిచేసిన హరీష్ కుమార్, రాయికల్ ఏఈ అర్జున్, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, లైన్ ఇన్స్పెక్టర్ మల్లారెడ్డి, లైన్మెన్ కుమార్, అసిస్టెంట్ లైన్మెన్ నారాయణ లకు పూల గుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యుత్ సిబ్బంది మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న అధికారులు కిందిస్థాయి ఉద్యోగులకు పూర్తి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ప్రతి ఉద్యోగికి బదిలీ సహజమని, బదిలీపై వెళ్లిన చోట మంచి సేవలు అందించి పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆకాంక్షించారు. అలాగే రాయికల్ సెక్షన్ పరిధిలోకి బదిలీపై వచ్చి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాయికల్ ఏఈ నవీన్, సబ్ ఇంజనీర్ సంతోష్, ఎస్ఎల్ఐ దేవేందర్, ఎల్ఐ చంద్రమౌళి, లైన్మెన్ ఆంజనేయులు, ఏఎల్ఎం కుమార్ అధికారులను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బి.లక్ష్మీరాజం, దమ్మ గంగారెడ్డి, లక్ష్మీనారాయణ, గంగరాజు, శ్రీనివాస్, అజయ్, శేఖర్, శ్రీనివాస్, కాంట్రాక్టర్ నరసింహారెడ్డి, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button