రాయికల్

విశ్వశాంతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

viswatelangana.com

June 21st, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించడం జరిగింది. పాఠశాలలోని విద్యార్థినీ విద్యార్థులందరూ వివిధ రకాల యోగ ప్రక్రియలలైన ఆసనాలు, ప్రాణాయామం మరియు మెడిటేషన్ దేవదాస్ మాస్టర్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగ దినోత్సవం యొక్క గొప్పతనం గురించి మన భారత దేశానికి చెందిన ఈ యోగ ఎన్నో ప్రపంచ దేశాలు ఫాలో అవుతున్నాయా నీ ఈ యోగ వలన కలిగే ఆరోగ్యకర లాభాలను విద్యార్థులందరికీ వివరించడం జరిగింది. ఈ అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. 2014 సెప్టెంబరు 27న భారత ప్రధాని నరేంద్రమోడి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేశారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతు ఇచ్చారు. భద్రతా సమితిలో శాశ్వత సభ్యులుగా ఉన్న అమెరికా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్, రష్యా వంటి దేశాలు కూడా ఈ తీర్మానానికి సహ ప్రతినిధులు. విస్తృతమైన చర్చల తరువాత డిసెంబర్ 2014 లో ఆమోదించనైనది. 2015 జూన్ 21 న, మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. జూన్ 21నే యోగా దినోత్సవం జరుపుకోవడానికి గల కారణం జూన్ 21 ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎక్కువ పగటి సమయం ఉన్న రోజుగా గుర్తింపు పొందడంతో అదే రోజును అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితికి ప్రధాని మోదీ సూచించారు అని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ మరియు ఉపాధ్యాయులు రంజిత్, మహేష్, అప్సర్, షారు, రజిత, సంజన, ఇందుజ, స్రవంతి, శ్రీజ,మౌనిక, మంజుల, నాగరాణి, కవిత, అపర్ణ, సౌజన్య, నిహారిక, రాజ్యలక్ష్మి, సునీత, మమత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button