కోరుట్ల
బాబు జగ్జీవన్ రామ్ పేదల పక్షపాతి
viswatelangana.com
April 5th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
భారతదేశ తొలి దళిత ప్రధాని బాధ్యతలు ఎంతో బాధ్యతతో నిర్వర్తించిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేసుకోవడం ఎంతో శుభసూచకమని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నాయకులు వనతడుపుల అంజయ్య తెలిపారు. జయంతి సందర్భంగా స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన అనంతరం బీహార్ లోని ఒక చిరు గ్రామంలో జన్మించిన బాబు జగ్జీవన్ రామ్ అనేకమైన పోరాటపట్టిన గల వ్యక్తి అని స్వతంత్ర ఉద్యమంలో ముందు వరుసలో ఉండి అనేక సందర్భాలు జైలులో జీవితాన్ని గడిపరని అన్నారు.



