రాయికల్
నటరాజ్ కు సుభాష్ చంద్రబోస్ జాతీయ ఐకాన్ అవార్డు

viswatelangana.com
January 20th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
అభిలాష హెల్పింగ్ హాండ్స్ ఆర్గనైజేషన్ వారి అయిదవ వార్షిక మహోత్సవ సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా అల్లీపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ బోదనపు నటరాజ్ కు సుభాష్ చంద్రబోస్ జాతీయ ఐకాన్ అవార్డును మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ప్రధానం చేశారు. ఇరవైనాలుగు సంవత్సరాలుగా సామాజిక, ఉద్యమ, జానపదగేయ కళాకారుడిగా రాణిస్తున్న బోదనపు నటరాజ్ కు ఈ అవార్డును అందించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సరోజనమ్మ తెలిపారు. అవార్డు అందుకున్న నటరాజ్ ని పలువురు కళాకారులు, కళాభిమానులు అభినందించారు.



