రాయికల్
బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరికలు

viswatelangana.com
March 11th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలము రామాజీపేట గ్రామ ఉపసర్పంచ్ హరీష్ రావు భేతి రాజేందర్ రిటైర్డ్ పంచాయతీరాజ్ ఏఈ వెంకట్రామారావు బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు వీరికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీ లోకి ఆహ్వానించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు



