బూటకపు ధర్నాలు మానుకోండి…కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలో గల జువ్వాడి భవన్ లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. గురువారం కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ రైతులతో కలిసి ధర్నా చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గత పది ఏళ్ల పాలనలో మీరు రైతులకు ఏం చేశారో చెప్పాలని నడుస్తున్న ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని మూసి వేయించిన ఘనత మీది కాదా అని ప్రశ్నించారు. కేవలం మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను రైతులను పక్కదో పట్టించడం కోసం ఇలాంటి ధర్నాలు చేయడం విడురంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలు, రైతుల సంక్షేమం కోసం పాటుపడుతుంటే అది చూచి జీర్ణించుకోలేక ఇలాంటి ధర్నాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కల్లూరు గ్రామానికి చెందిన వనతడుపుల అంజయ్య, మాదాపూర్ మాజీ సర్పంచ్, జోగిని పెల్లి మాజీ సర్పంచ్, చిన్న మేట్ పల్లి మాజీ సర్పంచ్ తో పాటు మరికొంతమంది బిఆర్ఎస్ నేతలకు రుణమాఫీ అయ్యింది అలాంటి వ్యక్తులు బూటకపు ధర్నాలో కూర్చోవడం ఏంటని, మీకు అయిన రుణమాఫీని తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి సరెండర్ చేస్తారని ప్రశ్నించారు. గురువారం జరిగిన ధర్నాలో రుణమాఫీ అయినా టిఆర్ఎస్ నాయకులను కూర్చోబెట్టుకోవటం ఏంటని దీనికి ఎమ్మెల్యే సంజయ్ సమాధానం చెప్పాలన్నారు. గతంలో మీరు చేస్తామన్న రైతు రుణమాఫీ ఎంత మందికి చేశారో చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేయడమే కాకుండా పేద ప్రజల సంక్షేమం కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు. కొన్ని సాంకేతిక కారణాలతో కొన్ని బ్యాంకుల్లో రుణమాఫీ కాలేదని, అవి కూడా త్వరలోనే పూర్తవుతాయన్నారు. విద్యుత్ సరఫరా విషయంలో మీకంటే మెరుగ్గానే విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పెరుమాండ్ల సత్యనారాయణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు గంగాధర్, జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు వసీం, పట్టణ ప్రధాన కార్యదర్శి నజ్జు, కార్యదర్శి మ్యాకల నర్సయ్య బన్న రాజేష్ సహాయ కార్యదర్శి ఎంబెరి సత్యనారాయణ, సోషల్ మీడియా ఇన్చార్జి వాసం అజయ్, చిట్యాల లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సంఘ లింగం, సోగ్రాభి, కటుకం దివాకర్, రాకేష్, రషీద్, పసుల కృష్ణ ప్రసాద్, మధు, నేతి శ్రీనివాస్, కరిపెల్లి అజయ్, క్యాస సంజీవ్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



