కోరుట్ల
మానవ మనుగడకు కర్మయే మూలాధారంబుర్ర భాస్కర శర్మ….

viswatelangana.com
March 22nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మానవ మనుగడకు కర్మయే మూలాధారం అని, కోరుట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న భాగవత సప్తహ యజ్ఞం లో భాగంగా ప్రవచకులు బుర్ర భాస్కర శర్మ భక్తులకు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ మనిషికి మాత్రమే దేవుడు బుద్ధిని ప్రసాదించాడని దాన్ని మనం ఎలా మార్చుకోవాలనేది మన జ్ఞానాన్ని బట్టి ఉంటుందని భక్తులకు విన్నవించారు. ప్రతి ఒక్కరు మానవ జన్మగా పుట్టిన తర్వాత ఏదైతే సహాయాన్ని చేస్తారో మళ్ళీ వచ్చే జన్మలో దానినే భగవంతుడు దాన్ని ప్రసాదంగా అందిస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కొత్త సురేష్, రేగుంట ప్రసాద్, తునికి భాస్కర్, అల్లాడి ప్రవీణ్, కొత్త సుధీర్, నీలి కాశీనాథ్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



