ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం కలదు

viswatelangana.com
కరీంనగర్ 9టి బెటాలియన్ కరీంనగర్ కమాండింగ్ ఆఫీసర్ పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఎన్సిసి శిక్షణ పొందిన, పొందుతున్న విద్యార్థులను వార్షిక తనిఖీ చేయటం జరిగింది. విద్యార్థులతో మాట్లాడుతూ ఎన్సిసి మంచి క్రమశిక్షణ తో పాటు సేవాభావం మరియు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతుందని బెటాలియన్ ఆఫీసర్ సీఓ ఏ. కే. జయంత అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు కైరం సత్యం మాట్లాడుతూ రాయికల్ మండలంలో ఎన్సిసి యూనిట్ కలిగిన ఏకైక పాఠశాలలో శిక్షణ పూర్తి చేసి పరీక్ష లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులను కమాండింగ్ ఆఫీసర్ ప్రోత్సహించారు. అని శిక్షణ పొందుతున్న విద్యార్థులకు సూచనలు ఇవ్వటం జరిగిందని, పాఠశాల స్థాయి నుంచి వచ్చే సర్టిఫికెట్ వల్ల విద్యార్థులకు పై చదువులకు అవకాశాలు,ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయమును గమనించి మీ మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడుతారని అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు కుందారపు శ్రీనివాస్,ఉపేందర్,వై.వి రావు,మోర విజయ్,నవీన్, భీమేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.



