భూపతిపూర్ సహకార సంఘ సర్వసభ సమావేశం

viswatelangana.com
రాయికల్ మండలం భూపతిపూర్ సహకార సంఘ సర్వ సభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేస్తున్నాయని & స్వల్ప కాలిక, దీర్ఘ కాళికా రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి సంఘ అభివృద్ధిలో పాటుపడాలని పేర్కొన్నారు. 2023-2024 వార్షిక నివేదికను ఆదాయం, ఖర్చులను సంఘ కార్యదర్శి చంద్రశేఖర్ చదివి వినిపించడం జరిగింది. వార్షిక సంవత్సరం 88 లక్షల విలువైన ఫర్టిలైజర్ను అమ్మడం జరిగిందని, రైతులకు ఎల్లవేళలా యూరియా, కాంప్లెక్స్ ఎరువులను , విత్తనాలు అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. సహకార సంఘం యందు డిపాజిట్ చేయాలని కోరుకుంటూ,సంఘ అభివృద్ధిలో పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నాగులమల్లయ్య గౌడ్, డైరెక్టర్లు కోసరి మహేష్, నేతుల లక్ష్మీనారాయణ, నిమ్మల భారతి శేఖర్ రెడ్డి, పాల్త్యా రమణ, కార్యదర్శి చంద్రశేఖర్, సిబ్బంది రాజేష్, రంజిత్, సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.



