కథలాపూర్
భూషణరావుపేట లో గడప గడపకు కాంగ్రెస్

viswatelangana.com
May 6th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్, గ్రామ శాఖ అద్యక్షులు తలారి మోహన్, సోషల్ మీడియా ఇన్చార్జి కూన అశోక్, దాసరి పెద్ద అంజయ్య, యాటకర్ల రాజు, సుంకెపవన్, గొట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.



