కథలాపూర్
మరమ్మత్తులకు నోచుకోని కల్వర్టు

viswatelangana.com
May 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని తాండ్రియాల – గంభీర్ పూర్ గ్రామాల మధ్యలో ఉన్న లోలెవెల్ కల్వర్టు కొన్ని నెలల క్రితం కురిసిన వర్షాలకు ఒకవైపు కోతకు గురైంది. గ్రామాల్లో పురాతన కాలం నాటి వంతెనలు శితిలావస్థకు చేరుకున్నాయి. రాత్రి వేళ ప్రయాణికులు వీటిపై ప్రయాణించేటప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన కు గురవుతున్నా పాలకులకు, అధికారులకు చీమ కుట్టినట్టు కూడా లేదు. అధికారులు త్వరగా స్పందించి మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు.



