కోరుట్ల

ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

viswatelangana.com

September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

జిల్లా పరిషత్ పైడిమడుగు ఉన్నత పాఠశాలలో సెప్టెంబర్ 5 న సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. వివిధ తరగతుల విద్యార్థులు, వివిధ సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరుమల్ల ఆనంద్ మాట్లాడుతూ… చదువు నేర్చుకునే విద్యార్థులు భయము, భక్తితో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలు సాధించి, తల్లిదండ్రులకు, టీచర్లకు, గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చి ఉన్నత పౌరులుగా ఎదగాలని, అదేవిధంగా ప్రతి విద్యార్థి పర్యావరణ రక్షణకు కట్టుబడే విధంగా వచ్చే వినాయక చవితి వేడుకలకు మట్టి వినాయకులను పూజించి పర్యావరణ రక్షణకు ముందుండాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button