రైతు రుణ మాఫీ ఆమోదం పట్ల హర్షం

viswatelangana.com
రాయికల్ మండలం కాంగ్రెస్ పార్టీ మైతాపూర్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పట్టభద్రుల శాసనమండలి సభ్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పేదలకు న్యాయం జరుగుతుందని ఉచిత బస్సు తో పాటు మరిన్ని పథకాలను సకాలంలో ప్రజలకు అందించడంలో ముఖ్యమంత్రి సేవలు అభినందనీయమని హర్షణీయమని రైతు రుణమాఫీ కూడ గొప్ప కార్యక్రమం అన్నారు. మండల పార్టీ నాయకులు తలారి రాజేష్ మాట్లాడుతూ ఏకకాలంలో 31 వేల కోట్లు మంజూరీ చేసి రైతు రుణమాఫీ చేయడం ద్వారా రైతు యొక్క సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ మరే ఇతర ప్రభుత్వం చేయలేదని గతంలో వైయస్సార్ హయాంలో లక్ష రూపాయల రుణమాఫీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వచ్చిందని మరల రెండు లక్షల రూపాయలు తీసుకున్న రైతులకు పూర్తి రుణమాఫీ చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్ ఆమోదం పొంది ఆగస్టు 15 లోపు అమలుకు అనేక సవాల్లు ఉన్నప్పటికీ రైతుల సంక్షేమమే లక్ష్యమని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని అన్నారు ఈ కార్యక్రమంలో, అజారుద్దీన్, గరిపెల్లి శ్రీనివాస్, భూస గంగమల్లయ్య, అనుమల్ల సత్యనారాయణ,నెమిళ్ళ స్వామి, కొల్ల వేణు, వంగ మల్లయ్య, నారాయణ, రఘుపతి,ఎల్లయ్య, మోహన్ రెడ్డి,పోచయ్య, శేఖర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు



