తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజయవంతం చేయండికరపత్రాల ఆవిష్కరణ

viswatelangana.com
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు జరిగే 76వ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా జిల్లా, మండల, గ్రామ సిపిఐ కేంద్రలలో ఎర్రజెండాలు ఎగురవేసి అమరుల త్యాగాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయం కోరుట్లలో ఉత్సవాల కరపత్రాలు పార్టీ నేతలు ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ… భూమి కోసం.. భుక్తి కోసం.. వెట్టి చాకిరి విముక్తి కోసం.. దొరలు జమీందారులు, దేశ్ ముకులు, పట్వారిలు, రజాకారుల, పెత్తందారి వ్యవస్థ రద్దు చేయాలని, దున్నేవాడికే భూమి కావాలని, నిజాం నవాబ్ నిరంకుశ పాలన అంతం చేయాలని జరిగిన పోరాటం ప్రజలకు వివరించాలన్నారు. ఈ పోరాటంలో 5వేల మంది అమరులు ఆయ్యారని, 10 లక్షల భూమి పేదలకు పంచ బడిందన్నారు. ఈ పోరాటంలో బిజెపి పార్టీ పాత్ర ఏమి లేదని తెలిపారు. ఈ ఘటనలు హిందూ- ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరించే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈ పోరాట స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుటకు జరిగిన తొలిదశ-మలిదశ-తుదిదశ సబ్బండ కులాల పోరాటాల ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు విస్మరించినందువల్ల నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి అమలు చేస్తామన్న హామీ మేరకు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేయాలని కోరారు. ఈనెల 20 న జిల్లా స్థాయి బహిరంగ సభ కోరుట్లలోని సి.ప్రభాకర్ భవన్ లో జరుగుతుందన్నారు. ఈ సమావేశమునకు సిపిఐ జాతీయ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, వామపక్ష పార్టీ నేతలు తదితరులు పాల్గొంటారని ఈ సభను విజయవంత చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నేతలు చేన్న విశ్వనాథం, సుతారి రాములు, ఎంఎం రాధ, మహమ్మద్ మౌలానా, ఎండి ఉస్మాన్, రామిల్ల రాంబాబు, వెన్న సురేష్, భూమారెడ్డి, మునుగోరి హనుమంతు, గుడెల్లి రాజన్న, రమేష్, శ్రీహరి, ఎండి ముక్రం తదితరులు పాల్గొన్నారు.



