కథలాపూర్
మోడల్ స్కూల్ పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం
viswatelangana.com
February 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో బుధవారం పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నరేష్ మాట్లాడుతూ విద్యార్థులు 10వ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించి ఉన్నత చదువులు చదవాలన్నారు. అనంతరం విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు విద్యార్థుల నృత్యాలు అలరించాయి. కార్యక్రమంలో పాటశాల అధ్యాపకులు శైలజ, ప్రసన్న, శారద, మల్లేశం, బాలేశం, రాజేందర్, పుర్ణచందర్, విద్యార్థులు పాల్గొన్నారు.



