ఇబ్రహీంపట్నం

యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతాం

యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్

viswatelangana.com

June 9th, 2025
ఇబ్రహీంపట్నం (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా నెలకొన్న యాదవుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుదామని యాదవ సంఘం అడహాక్ కమిటీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్ అన్నారు.. సోమవారం ఇబ్రహీం పట్నం మండలం భర్తీపూర్ – మూల రాంపూర్ గ్రామ యాదవ సంఘ భవనంలో జరిగిన సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు తొట్ల చిన్నయ్య, యాదవ్, మ్యాదరవేని రామంజనేయులు యాదవ్, అంకం శంకర్ యాదవ్, గుండెల నాగేష్ యాదవ్ లతో కలిసి పాల్గొని సభ్యత్వ నమోదుతో సంఘ బలోపేతం, సమస్యల పరిష్కారం, న్యాయంగా యాదవులకు దక్కాల్సిన హక్కుల సాధన తదితర విషయాలు చర్చించారు. అనంతరం భర్తీపూర్ – మూల రాంపూర్ గ్రామాల యాదవ సంఘ సభ్యులు మొత్తం 36 మంది సభ్యత్వం తీసుకోగ వారికి ఇంచార్జిలతో కలిసి సభ్యత్వ రసీదులందించిన జిల్లా అధ్యక్షుడు గనవేని మల్లేష్ యాదవ్. ఈ కార్యక్రమంలో భర్తీపూర్-మూల రాంపూర్ గ్రామాల పెద్దమనుషులు ముత్యాల రాములు, ముత్యాల మహేష్,జంగిడి మల్లేష్, బోయపెల్లి మల్లేష్, మహేష్, పెద్ద మల్లేష్,తోగిరి దశరథ్, సంఘ సభ్యులు పాల్గొన్నారు..

Back to top button