రథయాత్ర ప్రారంభం
viswatelangana.com
జగిత్యాల జిల్లా ధర్మజాగరణ ఆధ్వర్యంలో ఆదివారం సనాతన ధర్మం కోసం రథయాత్రనుప్రారంభించారు.ఈ సందర్భంగా రాయికల్ పట్టణంలోని శ్రీ చెన్నకేశవ నాథ ఆలయం నుండి రథంపై పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ విగ్రహాలకు వేద పండితులచే పూజలు జరిపి ప్రారంభించారు. ఈ రథయాత్ర ఈరోజు నుండి ఈనెల 31 వ తేదీ వరకు జగిత్యాల జిల్లాలోని ప్రతి మండలం, ప్రతి గ్రామాల్లో ఉంటుందని హిందూ ధర్మజాగరణ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగరణ సమితి జిల్లా ప్రముఖ్ వేముల రాంరెడ్డి, జిల్లా పూర్తి సమయ ప్రముఖ్ సిద్ధంశెట్టి మహేష్,హిందు వాహిని ప్రాంత సహ సంపర్క్ ప్రముఖ్ వేముల సంతోష్ జీ,విశ్వ హిందూ పరిషత్ జిల్లా సత్సంగ్ ప్రముఖ్ కాయితి గంగాధర్, రాయికల్ మాజీ సర్పంచ్ మచ్చ నారాయణ, రాయికల్ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సామల సతీష్, తుమ్మల సదాశివరెడ్డి పందిరి లక్ష్మీనారాయణ కొడిమ్యాల రామకృష్ణ రవి చింత రాజేష్,ఆవుల లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

