
viswatelangana.com
March 25th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల అతి పురాతన దేవాలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ బుర్ర భాస్కర శర్మ చే భాగవత సప్తాహం ప్రవచన కార్యక్రమం ఆరవ రోజు ఆసక్తికరంగా జరిగింది. ఈ సందర్భంగా మంగళవారం రోజు శ్రీకృష్ణ లీలలు, అల్లరి చేష్టలు, జీవన వృత్తాంతం, గురించి భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్త సురేష్, తునికి భాస్కర్, కొత్త సుధీర్, అల్లాడి ప్రవీన్, నీలి కాశీనాథ్, రేగుంట ప్రసాద్, ఉత్తూరి మారుతి, కంఠాల రవీందర్ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.



