కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకరంతో ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందాలి
పిఎం, సిఎం, మందకృష్ణ మాదిగలకు పాలభిషేకం

viswatelangana.com
ఎస్సీ, ఎస్థీ వర్గీకరణ తీర్పును ప్రకటించిన సుప్రీం కోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తు కోరుట్ల అంబేద్కర్ మాదిగ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మార్పీఎస్ ఉద్యమ నేత మంద కృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలభిసెకం చేశారు. శుక్రవారం కోరుట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ మాదిగ యువజన సంఘం అధ్యక్షులు శనిగారపు రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్ మాట్లాడుతూ. ముప్పై సంవత్సరాలుగా చేస్తున్న వర్గీకరణ ఉద్యమం సంచలనాత్మక తీర్పుతో ఎస్సీ , ఎస్టీ ఉప కులాలకు న్యాయం జరుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకరంతో ఎస్సీ, ఎస్టీ ప్రజలు అభివృద్ధి పథంలోకి వస్తారనే ఆశలను నిర్వీర్యం చేయకుండా వారిని అక్కున చేర్చుకోవడం, రాజ్యాంగాన్ని రక్షించడం ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా స్వీకరించాలని పేట భాస్కర్ కోరారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు కొంతం రాజం, తిరుమల గంగాధర్, కౌన్సిలర్లు మోర్తాడ్ లక్ష్మీ నారాయణ, ఎంబేరి నాగభూషణం, పిషర్మేన్ కమిటీ అధ్యక్షుడు ఇట్యాల రాజేందర్, బిజెపి దళిత మోర్చ అధ్యక్షుడు బెక్కెం అశోక్, సంఘ కోశాధికారి చిట్యాల ప్రభాకర్, మోర్తాడ్ రాజశేఖర్, నరేష్, నాయకులు చిట్యాల లక్ష్మణ్, లచ్చయ్య, దొబ్బల వెంకటేష్, తాళ్లపెల్లి మనోజ్, వంక కిరణ్, తెడ్డు విజయ్, దినేష్, రుపేష్, చింటు తదితరులు పాల్గొన్నారు.



