కరీంనగర్కోరుట్ల

రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ భూర్ల నరేష్ ఎంపిక

viswatelangana.com

September 4th, 2024
కరీంనగర్ (విశ్వతెలంగాణ) :
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

రాష్ట్రస్థాయి ఉత్తము అధ్యాపకుడిగా ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కరీంనగర్ లో పనిచేస్తున్న కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ భూర్ల నరేష్ ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ డా. వై. సత్య నారాయణ తెలియజేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల కు చెందిన కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా॥ భూర్ల నరేష్ 2013, జనవరి 1 న అప్పటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డిగ్రీ కళాశాల అధ్యాపకుడిగా నియామకం అయ్యారు. గత 12 సంవత్సరాలుగా కామర్స్ సబ్జెక్టు బోధనతో పాటు, పాఠ్య పుస్తక రచయితగా 5 పుస్తకాలను రచించడం తో పాటు 20 జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో తన పరిశోధనన పత్రాలను ప్రచురించారు. ఢిల్లీ, భువనేశ్వర్, అహ్మదాబాద్, గ్వాలియర్ లలో జరిగిన జాతీయ అంతర్జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్స్ లలో పాల్గొన్నారు. గతం లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మెట్ పల్లి, కోరుట్ల లలో పనిచేసి అకాడమిక్ పరంగానే కాకుండా పరిపాలన సంబందమైన పదవులు వైస్ ప్రిన్సిపాల్, అకడమిక్ కోఆర్డినేటర్, దోస్త్ (DOST) కోఆర్డినేటర్, జాతీయ సేవ పథకం ప్రోగ్రాం ఆఫీసర్ గా విధులు నిర్వర్థించారు. గతం లో తెలంగాణా దశాబ్ధి ఉత్స వాలలో జగిత్యాల జిల్లా స్థాయి ఉత్తమ అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, కళాశాల విద్యశాఖ రాష్ట్ర స్థాయి పురస్కారానికి ఎంపిక చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అద్యాపకులు (టీచింగ్), నాన్- టీచింగ్ స్టాఫ్ అభినందినారు.

Related Articles

Back to top button