సన్న బియ్యం లబ్ధిదారు ఇంట్లో భోజనం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు

viswatelangana.com
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన దానికి కట్టుబడిగా, రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడుజువ్వడి కృష్ణారావు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన కోరుట్ల పట్టణంలోని సన్న బియ్యం లబ్ధిదారు ద్యావన పల్లి గంగ ఇంటిలో భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి హామీని అమలు చేసి తీరుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారావుతో పాటు కోరుట్ల మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు కొంతం రాజం, తిరుమల గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్లేటి మహిపాల్ రెడ్డి, పట్టణ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మచ్చ కవిత, మాజీ కౌన్సిలర్ ఎంబెరి నాగభూషణం, ఏంబేరి సత్యనారాయణ, నేమూరి భూమయ్య, చిటిమెల్లి రంజిత్ గుప్తా, బొల్లె నరసయ్య, చిలువేరి విజయ్, అయిండ్ల గణేష్, తెడ్డు విజయ్, తదితరులు పాల్గొన్నారు.



