రాయికల్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

viswatelangana.com
October 25th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రాయికల్ పరిదిలోని ఏఎంసీ రాయికల్ లో, శివాజీనగర్ లో మరియు మహితాపూర్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ఎండి.ఖయ్యాం, ప్యాక్స్ ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ ఛైర్మెన్ మోర హన్మండ్లు ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో సంఘ దత్తత అధికారిని ఎం.స్వప్న, పాక్స్ వైస్ చైర్మన్ బేతి మల్లారెడ్డి, డైరక్టర్లు కొల్ల నారాయణ, కైరం రమణ, బోడ భూమరాజం, మున్సిపల్ కౌన్సిలర్లు తురుగ శ్రీధర్, మహేందర్ బాబు, మహేష్ గౌడ్ మరియు వివిధ పార్టీల నాయకులు కొండూరి రవీందర్ రావు, గండ్ర అచ్యుతరావు, గన్నె రాజారెడ్డి, సంఘ సీఈవో ఎలిగేటి రవికుమార్, సెంటర్ ఇంచార్జి గోనె మహేశ్, నాగెల్లి శంకర్, కలమడుగు భూమేష్ మరియు రైతులు ఇతర నాయకులు పాల్గొన్నారు.



