రాయికల్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

viswatelangana.com
April 23rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ధర్మాజీపేట్, వడ్డేలింగాపూర్, బోర్నపెల్లి గ్రామాలలో భూపతిపూర్ సహకార సంఘం అధ్యక్షులు ఏనుగు ముత్యం రెడ్డి వరి ధాన్యం కొనుగోలు కేంద్రo ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు అల్లాల అంజిత్, మల్యాల జలపతి రెడ్డి, కోల శ్రీనివాస్, నాయకులు పాదం రాజు, కొడిపెల్లి ఆంజనేయులు, మల్యాల మధు, ఉప్పు లక్ష్మణ్, మారంపల్లి హరీష్ , రాజు నాయక్, నందు నాయక్, శేఖర్, ఏఈఓ నరేష్,సంఘ కార్యదర్శి ఎల్లాల చంద్ర శేఖర్, సంఘ సిబ్బంది రంజిత్, సెంటర్ ఇన్చార్జిలు సురేష్, సోమేశ్ యాదవ్, గుగ్గిళ్ళ వెంకటేష్, పవన్ మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.



