మా కష్టాలు తిరేవి ఎప్పుడో, హై లెవెల్ బ్రిడ్జిగా మార్చేది ఎప్పుడో

viswatelangana.com
కోరుట్ల మండలంలోని కల్లూరు గ్రామ నుండి పైడిమడుగు రాయికల్ వెళ్లే రహదారి పెద్ద వాగు మధ్యలో గలలో లెవెల్ వంతెనతో ప్రతి వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కల్లూరు మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పర్యవేక్షణ అనంతరం సంబంధిత ఆర్ & బి ఇంజనీర్ డిజిటల్ సర్వే నిర్వహించి వెళ్లడం జరిగిందని ఇంతలోనే నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలతో పురాతన వంతెన తాత్కాలికంగా కొట్టుకపోగా మళ్లీ ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి నెలకొందని మట్టి కొట్టుకపోవటంతో మల్లి అదే పరిస్థితి అని, గ్రామ తాజా మాజీ సర్పంచ్ వనతడుపుల అంజయ్య ఆవేదన వ్యక్తం చేసారు. మిషన్ భగీరథ పైపులు 100 మీటర్ల పై గా జాయింట్లు విడిపోయి వాగులో కొట్టుకు పోయినట్లు మిషన్ భగీరథ డి.ఈ ఆనంద్ పర్యవేక్షణ చేసి ఎస్సీకి వివరణ చెప్పారు. ఏది ఏమైనా ఈ యొక్క బ్రిడ్జిని హై లెవెల్ బ్రిడ్జిగా మార్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారని అంజయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, గ్రామస్తులు, మాజీ ఉప సర్పంచ్ రాకేష్, జగన్ రావు, శేఖర్ వీరస్వామి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.



