మెట్ పల్లి

విజేత స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్ ను సందర్శించిన రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డా. బూర్ల నరేష్

viswatelangana.com

October 8th, 2024
మెట్ పల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో విజేత స్టూడెంట్ కౌన్సెలింగ్ సెంటర్ ను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. బూర్ల నరేష్ సందర్శించి నిర్వాహకుడు పుప్పాల నవీన్ కుమార్ ను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని,లక్ష్యాలను సాధించే తత్వాన్ని పెంచేందుకు ఒక కౌన్సెలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా నవీన్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా పుప్పాల నవీన్ కుమార్ తాను రచించిన పుస్తకాన్ని అందజేశారు.

Related Articles

Back to top button