రాయికల్
తపస్ ఆధ్వర్యంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

viswatelangana.com
March 7th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మూటపెల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులు ఏలేటి ప్రణిత, సరిత, నవిత లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచర్ల శ్రీనివాస్, అంకారావు,నరేష్,మధు మరియు తపస్ జిల్లా బాధ్యులు చెరుకు మహేశ్వర శర్మ,ఏఏపీసీ చైర్మన్ వనిత తదితరులు పాల్గొన్నారు.



