రాయికల్
విద్యార్థులు ఆర్థిక క్రమశిక్షణ అలవరుచుకోవాలి
viswatelangana.com
January 29th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
- విద్యార్థులు ఆర్థిక క్రమశిక్షణ అలవరుచుకోవాలని యూనియన్ బ్యాంక్ ఇటిక్యాల బ్రాంచి మేనేజర్ రవి అన్నారు
రాయికల్ మండలం ఇటిక్యాల ఉన్నతపాఠశాల విద్యార్థులు క్షేత్ర సందర్శన లో భాగంగా సోమవారం యూనియన్ బ్యాంక్ ను సందర్శించారు బ్యాంక్ లో జరుగు కార్యకలాపాల వివరాలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు బ్యాంకు ఖాతా పుస్తకాలు అందజేశారు విజ్ఞాన విహార యాత్ర లో మిగిలిన కొంత నగదును ఆయా విద్యార్థుల ఖాతాలో జమచేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్ సదాశివ్ ఉపాధ్యాయులు గాజెంగి రాజేశం చెరుకు మహేశ్వర శర్మ ఎద్దండి రమేష్ ఖాజా జియావోద్దీన్ వి.సంపత్ కుమార్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ వి.రంజిత్ కుమార్ క్యాషియర్ టి.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు



