కోరుట్ల

విలేకర్ సుదర్శన్ రెడ్డి పై దాడిని కండిస్తూ కోరుట్ల జర్నలిస్టులు జాతీయ రహదారిపై ధర్నా

viswatelangana.com

October 19th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రాత్రి (అదాబ్ హైదరాబాద్) విలేకర్ సుదర్శన్ రెడ్డి పై జరిగిన దాడిపై నిందితులను కఠినంగా శిక్షించాలని జగిత్యాల జిల్లా కోరుట్లలో జర్నలిస్టులు జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్ మాట్లాడుతూ భావప్రకటన స్వేచ్ఛ ఒక్క పాత్రికేయులకే కాదు ప్రతి పౌరునికి వర్తిస్తుందని, ప్రధానంగా పాత్రికేయులని టార్గెట్ చేసుకొని కొందరు అగంతకులు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతును నొక్కి వారి ఆగడాలను యధావిధిగా చలామణి చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఖండిస్తున్నాయని అన్నారు. అలాగే విలేకర్ సుదర్శన్ పై దాడులు చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలనీ కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. నిరసన కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button