విశ్వశాంతి పాఠశాల పూర్వ విద్యార్థికి చిరు సన్మానం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన విశ్వశాంతి ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థి జుంజూరి రాజేందర్ ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన ఫలితాల్లో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించినందుకు విశ్వశాంతి ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్, అధ్యాపక బృందం ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజేందర్ మాట్లాడుతూ…. విశ్వశాంతి ఉన్నత పాఠశాలలో నర్సరీ నుండి పదవ తరగతి వరకు చదువుకొని గురువుల చేత సన్మానం పొందడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులకు “లైఫ్ కెరీర్ బిల్డింగ్”పై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి నేటి పోటీ ప్రపంచంలో పోటీ తత్వంతో హార్డ్ వర్క్ ద్వారా చదువుల్లో రాణిస్తూ మీ ముందున్న విశ్వశాంతి పూర్వ విద్యార్థి డాక్టర్ రాజేందర్ ఏ విధంగా అయితే చంద్రయాన్ -3 శాటిలైట్ ప్రాజెక్టులో ఒక సైంటిస్ట్ గా తన కాంట్రిబ్యూషన్ అందించారో విద్యార్థులు మీరందరూ ఆయనను ను ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో వీరిలాగ సైంటిస్ట్ గా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్ ఉపాధ్యాయులు మహేష్,రంజిత్, షారు,రజిత సంజన, ఇందూజ, శృతి, శ్రీజ, మనీషా, అపర్ణ, మమత, ప్రత్యూష ,రాజ్యలక్ష్మి, మమత, స్రవంతి,సహస్ర తదితరులు పాల్గొన్నారు.



