కొడిమ్యాల
వేంకటేశ్వర స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు

viswatelangana.com
February 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోనీ స్వయంభూ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో. సోమవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. సరస్వతి మాత పుట్టినరోజు పర్వదినాన్ని పురస్కరించుకొని బాలబాలికలకు అక్షరాభ్యాసం చిన్నారులకు అన్నప్రాసన వంటి కార్యక్రమాలు ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమంలో కొడిమ్యాల మరియు చుట్టూ ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని ధర్శించుకొని అక్షరాభ్యాసం పూజలో పాల్గొన్నారు.



