శివాలయానికి పునరు వైభవం

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గత కొన్నినెలల క్రితం ఆలయ పూజారి నిర్వాహకులు శివలింగం శివైక్యం కావడంతో ఆలయం కళ తప్పి వేలవేల పోయింది. భక్తులు రాక తగ్గడంతో పూజారి లేకపోవడంతో ఆవేదనకు లోనయిన శివ భక్తులు ఆలయ పునరు వైభవానికి నడుం బిగించారు, పేర్లు ప్రతిష్ఠల కోసం పాకులాడకుండ మన శివాలయం పేరా వాట్సాప్ సామజిక మధ్యమ సమూహంగా ఏర్పాడి ఆలయం యాజమాన్యంతో మాట్లాడి ఆలయానికి భక్త జన సహకారంతో రంగులు, వాటర్ ట్యాంక్, హనుమాన్ ఆలయం చుట్టూ రైలింగ్ కంచె ఏర్పాటు, ఆలయ పూజారిని ఏర్పాటు చేయడంతో ఆలయంలో రోజు పూజాలు జరుగుతున్నాయి. బ్రాహ్మణోత్తములచే మాహా రుద్రా హోమం నిర్వహించి, శివాలయ సంప్రోక్షణ చేసిన అనంతరం స్వచ్ఛంద్ధంగా బ్రాహ్మణ పండితులు పూజాలు నిర్వహించగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. అనంతరం మహాన్నదానంలో అన్నప్రసాదాలు స్వీకరించారు. చాలా రోజుల తర్వాత ఆధ్యాత్మిక పండుగా వాతావరణం కనిపించింది. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించిన ఎక్కడ పేర్లు పెద్దరికం కోసం ప్రాకులాడకుండ కేవలం శివభక్తులనే వ్యవహరించి నిర్వహులను గ్రూప్ సభ్యుల పరిణితి చెందిన తీరును అనేక మంది ప్రశంసించారు, ఆలయ అభివృద్ధి కోసం నెలవారీ నిధిని కూడ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.



