కోరుట్ల
శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి అనుబంధంగా సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ

viswatelangana.com
August 26th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలోని అతి ప్రాచీన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయంలో గత 6 సంవత్సరాలుగా ప్రతి కార్యక్రమం సంస్కృతి సేవా సమితి సభ్యుల సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజున సంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీ ని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉంటే బాగుంటుందని ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి ఆశీస్సులతో సాంస్కృతి సేవా సమితి వెల్ఫేర్ సొసైటీని శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి అనుబంధం గా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సేనాపతి ఆచార్య ప్రవీణ్ కుమార్ మరియు సoస్కృతి సేవా సమితి అధ్యక్షులు విశ్వ సాయి తేజ, జీకురి నరేందర్, శ్రీపతి రోహిత్, చాడ శివ వర్ధన్, సేనాపతి కృష్ణచంద్ర, కోటగిరి నాగసాయి, సుమంత్, శ్రీపతి హర్షిత్, కొక్కొండ మణిరాజ్ పాల్గొన్నారు.



