కోరుట్ల
శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్లో స్వచ్ఛతా హి సేవా

viswatelangana.com
September 28th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలను అలాగే తడి, పొడి చెత్త వేరు చేసే విధానాన్ని వివరించి వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఇందులో 150 విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా కోరుట్లను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుకోవచ్చని పిల్లలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గొపు వెంకటేష్ అలాగే కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్, మాతాజీ లు అలాగే ప్రభంధకారిని సభ్యులు ఉపాధ్యాయులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



