కథలాపూర్

సంక్షేమం,అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ కి రెండు నేత్రాలు

viswatelangana.com

June 28th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండల కేంద్రంలో గల ఎస్ ఆర్ ఆర్ గార్డెన్ లో 88 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి మరియు 37 లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అందించడం జరిగింది, ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మన పెద్దలు అంటుంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని అంటే అప్పుడైనా ఇప్పుడైనా సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఒక చిరకాల కోరిక, అలాంటి కోరికను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ఇందిరా గాంధీ హయం నుండి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి మంజూరు చేస్తూనే ఉన్నది, ఈ క్రమంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు మనం చూడలేం అని అంటే అతిశయోక్తి కాదు, అలాగే పెళ్లి విషయానికొస్తే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఒక ఆడపిల్ల పెళ్లి చేయడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం ఇందుకుగాను ప్రభుత్వం ఆడపిల్ల కుటుంబంపై భారాన్ని కొంతలో కొంతైనా తగ్గించడానికి గాను లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ కుటుంబం తర్వాత ప్రభుత్వం ఆడపిల్ల పెళ్లి విషయంలో అండగా నిలుస్తున్నది. నేటి సమాజంలో ఆర్థిక అసమానతలతో పోటీపడుతూ జీవించడం అనేది ప్రతి ఒక్కరికి ఒక సవాలు అలాంటిది విధి వంచనలో ఆసుపత్రుల పాలై ఆర్థిక భారంతో కుంగిపోయే వారికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు కొంత ఊరటను కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు, ఇట్టి విషయాల్లో ప్రభుత్వం రాజీ పడకుండా, ఎల్ ఓ సి లు, ఆరోగ్యశ్రీ, 500 కే సిలిండర్, సన్న బియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇలా సంక్షేమ పథకాల్లో రాజీ పడకుండా ప్రభుత్వం ప్రతి పేదవాడి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందన్న విషయం ప్రతి ఒక్కరు గమనించాలని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే కళ్యాణ లక్ష్మి మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు ప్రభుత్వం నుండి తమకు లభించిన ఆర్థిక సహాయాని కై కాంగ్రెస్ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో కథలాపూర్ మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి నాగరాజ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, రాష్ట్ర పీసీసీ కార్యవర్గ సభ్యుడు తొట్ల అంజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులిసిరిశా హరిప్రసాద్, కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ధనుంజయ రెడ్డి, మండల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వెగ్యారపు శ్రీహరి, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, సీనియర్ నాయకులు వెలిచాల సత్యనారాయణ, ఎస్సీ సెల్ పంబాల శంకర్, బీసీ సెల్ లింగ గౌడ్, మండల్ కార్యవర్గ సభ్యుడు జవ్వాజి రవి, మండల్ సోషల్ మీడియా కన్వీనర్ కూన అశోక్, మండల యూత్ అధ్యక్షుడు అంబటి రాధాకృష్ణ, తలారి మోహన్, గడ్డం స్వామి రెడ్డి, గడ్డం చిన్నారెడ్డి,శేఖర్, వర్ధినేని లింగారావు, బైర మల్లేష్, కూన శ్రీనివాస్, అంగ మహేష్, కారపు గంగాధర్, విజయ్,అన్ని హోదాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అలాగే లబ్ధిదారులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button