సమత …ఆత్మీయత…! .. .. మతసామరస్యానికి ప్రతీక రంజాన్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

viswatelangana.com
ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులతో పాటు హిందువులు సైతం పాల్గొని మత సామరస్యానికి అతీతంగా రంజాన్ మాసం నెల సమత… ఆత్మీయత కనిపిస్తోందని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శనివారం రాయికల్ పట్టణంలో జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు మున్ను ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం మత పెద్దలకు పండ్లు అందించి ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఇఫ్తార్ విందుతో సోదర భావం పెంపొందిస్తుందని అన్నారు. మతసామరస్యానికి ప్రతీకగా రంజన్ మాసమని అందరూ సుఖశాంతులతో, సహోదర భావంతో మెలగాలని ఆకాక్షించారు. సుమారు 600మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటుచేసిన మున్ను, జంగిలి కిషోర్ లను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఖయ్యూం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మ్యాకల రమేష్, జిల్లా మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, మైనార్టీ నాయకులు షాకీర్, మసూద్, మోభిన్, బాబా, ఖలీల్, శంశీర్, నబి సాబ్, ముజాఫర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపి రాజారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, హనుమాన్ ఆలయ చైర్మన్ దాసరి గంగాధర్, మాజీ సర్పంచ్ ఎద్దండి భూమ రెడ్డి, నాయకులు కొయ్యేడి మహిపాల్, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య, ఏద్దండి దివాకర్, పొన్నం శ్రీకాంత్, నరేష్, నాగరాజు, రాకేష్ నాయక్, రాజేష్, గుమ్మడి సంతోష్, మైనార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



