మేడిపల్లి

సరస్వతి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే

viswatelangana.com

February 28th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం లోని కొండాపూర్ గ్రామంలో సరస్వతి విద్యాలయంలో బుధవారం రోజున నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సైన్స్ పరికరాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎద్దులాపురం దయాకర్ మాట్లాడుతూ సర్ సివి రామన్ కు 1930 సంవత్సరంలో ఫిజిక్స్ లో నోబెల్ బహుమతి వరించింది అని అన్నారు. ఈ సందర్భంగా 1987 సంవత్సరం నుండి ఫిబ్రవరి 28 రోజున ప్రతి సంవత్సరం నేషనల్ సైన్స్ డే వేడుకలను జరుపుకుంటున్నామని తెలిపారు. 1888 నవంబర్ 7 నా తమిళనాడు రాష్ట్రంలోని తిరుచపల్లి గ్రామంలో ఆయన జన్మించాడు అని అన్నాడు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఏదిలాపురం పద్మశ్రీ, ఉపాధ్యాయులు మంద సునీత, తోపారపు సోనీ, కుంట రమ్య, మేడిపల్లి దివ్య, వడ్లగట్ట సుప్రియ, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button