మేడిపల్లి
సరస్వతి విద్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం

viswatelangana.com
June 21st, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామం శ్రీ సరస్వతీ విద్యాలయం లో శుక్రవారం రోజు ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు యోగా, మెరిటేషన్ క్లాస్ లను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఎదులాపురం దయాకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యోగా అనేది ఒక సరళమైన ప్రక్రియ యోగాను జీవనశైలిలో భాగం చేసుకోవాలని, ప్రతీ ఒక్కరూ ప్రతిరోజూ యోగచేయటం వలన మనస్సు శరీరం ఏకమై రోగాలు దరిచేరవని అన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎదులాపురం పద్మశ్రీ, ఉపాద్యాయులు శ్రీవేద, లావణ్య, సుప్రియ, సునీత, మమత, దివ్య, రమ్య, సోని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



