కోరుట్ల

ఎన్సీఎఫ్ఈ వారి సహకారం తో విడ్స్ మేడిపల్లి సీఎఫ్ ఎల్ ఆధ్వర్యంలో బ్యాంకు లావాదేవీలపై అవగాహన సదస్సు

viswatelangana.com

February 17th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

ఆర్బిఐ వారి సహకారంతో విడ్స్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మేడిపల్లి సీఎఫ్ ఎల్ సెంటర్ వారిచే జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో ఎన్ సీ ఎఫ్ ఈ (నేషనల్ సెంటర్ ఫర్ ఫైనాన్సియల్ ఎడ్యుకేషన్ ) వారి సహకారంతో ఆర్థిక అక్షరాస్యత పై కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పిల్లలకి అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేడిపల్లి విడ్స్ సీఎఫ్ ఎల్ కౌన్సిలర్ నవీన్ విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్, విద్యాలక్ష్మి పోర్టల్, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, సుకన్య సమృద్ధి యోజన, అటల్ పెన్షన్ యోజన, ఎన్పి ఎస్ వాత్సల్య, ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, పీఎంఈజిపి తదితర అంశాల పట్ల వీడియోల రూపంలో చూపించి వివరించినందుకు గాను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విడ్స్ మేడిపల్లి సీఎఫ్ ఎల్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సీఎఫ్ఎల్ కౌన్సిలర్లు నాగేంద్రప్రసాద్, నవీన్, మహేష్, పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button