సింగపూర్ లో ఆషాడ మాసం పోచమ్మ తల్లి బోనాల పండుగ

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల్ వివిధ గ్రామ యువకులు,వివిధ జిల్లా వారు బతుకుదెరువు కోసం సింగపూర్ లో ఉన్న తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఆదివారము సమయం ఆరు గంటల నుంచి అంగరంగ వైభోగంగా శ్రీ హర్షకేశవ టెంపుల్ లో భక్తిశ్రద్ధలతో పోతరాజు పులి వేషాలతో భక్తి పాటలతో నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి బోనాలు సమర్పించిన వారిలో బోయిని సమ్మయ్య, సరూప,పెద్ది కవిత, శేఖర్ రెడ్డి,దీపా రెడ్డి, చర్ల అభినయ్, కిరణ్, చెట్ల ఉష, విక్రమ్, సింగపూర్ లో నివసిస్తున్న వివిధ జిల్లా వాసులు సుమారు 500 మంది పాల్గొన్నారు వారికి తెలుగు సొసైటీ వారు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదం అన్నదాన ప్రసాదం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వారు సొసైటీ అధ్యక్షులు బొమ్మ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, జ్యోతిశ్వర్ రెడ్డి,నగేష్, మరియు కమిటీ సభ్యులు జనార్ధన్, అనిల్, ప్రసాద్, బైరి రవి, జిత్తు, విజయ్ స్వామి, మహేష్ శ్రీధర, కొడిమ్యాల్ మండల్ వాసులు గుడిపల్లి శ్రీనివాస్, గుడిపల్లి వెంకటేశం, దయ్యాల మనోజ్, కొండ నవీన్, తిప్పాయపల్లె శ్రీనివాస్ రెడ్డి, పిట్టల మురళి, గుడిపల్లి మహేష్, రాకేష్, బైరి వినీత్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు



